మరోసారి వైరల్ అయిన శాతకర్ణి

Wednesday,April 12,2017 - 03:06 by Z_CLU

సంక్రాంతి కానుకగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయాన్నందుకుంది. ఈ సినిమా ఫైనల్ రన్ ఎప్పుడో ముగిసింది. ప్రస్తుతం హీరో బాలకృష్ణ తన 101వ సినిమా పనిలో బిజీగా ఉన్నారు. అయితే బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ సినిమా మరోసారి చర్చకొచ్చింది. దీనికి కారణం ఈ వీడియోనే.

 

భారీస్థాయిలో గ్రాఫిక్స్ అవసరమున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను రికార్డు టైమ్ లో పూర్తిచేశాడు దర్శకుడు క్రిష్. ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాను అనుకున్న టైమ్ లో పూర్తిచేసిన క్రిష్ ను టాలీవుడ్ ప్రముఖులంతా అప్పట్లో మెచ్చుకున్నారు. ఆ సినిమాకు పనిచేసిన గ్రాఫిక్స్ టీం, తాజాగా శాతకర్ణి గ్రాఫిక్స్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.