మరికొన్ని గంటల్లో రెడ్ టీజర్

Friday,February 28,2020 - 10:20 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రెడ్ టీజర్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈరోజు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు రెడ్ టీజర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాబోతోంది. ఈ టీజర్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే, రామ్ ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఇది.

తమిళ్ లో హిట్టయిన తడమ్ సినిమా ఆధారంగా తెరకెక్కుతోంది రెడ్. కెరీర్ లో తొలిసారి రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఈ సినిమాలో. ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరక్ట్ చేస్తున్నాడు. సినిమాలో రామ్ షేడ్స్ ఎలా ఉంటాయనే విషయం మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. తన గెటప్స్ తో రామ్ షాక్ ఇవ్వబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. వచ్చే వారం ఈ ఒక్క పాటను రామోజీ ఫిలింసిటీలో పూర్తిచేయబోతున్నారు. నివేత పెతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారు.