ప్రమోషన్స్ లో ముందున్న "రెడ్"
Monday,May 18,2020 - 03:12 by Z_CLU
ప్రస్తుతం కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. అందులో రామ్ నటించిన ‘రెడ్’ ఒకటి. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 9న రిలీజ్ అనుకోని ఆ ప్రణాళిక ప్రకారం జెట్ స్పీడ్ లో షూట్ ఫినిష్ చేశారు. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు.
థియేటర్స్ తెరిచే లోపు సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. అందుకే ఇప్పటికే ప్రమోషన్స్ తో స్పీడ్ పెంచారు. తాజాగా రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన డించక్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే సినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇలా లాక్ డౌన్ ప్రమోషన్స్ లో రామ్ ‘రెడ్’.. అందరికంటే ముందుంది.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కింది రెడ్ మూవీ. రామ్ ఇందులో డ్యూయల్ రోల్స్ లో కనిపించబోతున్నాడు. మణిశర్మ సంగీతం అందించాడు.