'ప్రభాస్ 20' షూటింగ్ అప్ డేట్స్

Friday,February 28,2020 - 11:05 by Z_CLU

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ డైరెక్షన్ లో పిరియాడిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్న యూనిట్ త్వరలోనే జార్జియా బయలుదేరనుంది.

మార్చ్ 15 నుండి ఇరవై రెండు రోజుల పాటు జార్జియాలో ఓ భారీ షెడ్యుల్ జరగనుంది. అక్కడ ప్రభాస్ , పూజా హెగ్డే మరికొందరు ఆర్టిస్టులపై కొన్ని సీన్స్ తీయనున్నారు. తిరిగొచ్చాక ఓ వారం గ్యాప్ తీసుకొని హైదరాబాద్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యుల్ తో టాకీ పూర్తవుతుంది.

కృష్ణంరాజు సమర్పణలో యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో థియేటర్స్ లోకి రానుందని సమాచారం.