Ram Red - ఈ సంక్రాంతి కలిసొస్తుందా?
Wednesday,December 23,2020 - 09:30 by Z_CLU
‘ఇస్మార్ట్ శంకర్’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్ (Ram Pothineni), సంక్రాంతి పండక్కి ‘రెడ్‘ (Red Movie) తో థియేటర్లలోకిరానున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, ‘రెడ్’కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు.
రేపు ‘రెడ్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. అందులో సంక్రాంతి రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఈ సంక్రాంతి రామ్ కు కలిసొస్తుందా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది. అతడి మొదటి సినిమానే సంక్రాంతికొచ్చి బ్లాక్ బస్టర్ హిట్టయింది. అదే దేవదాసు. అయితే ఆ తర్వాత సంక్రాంతి బరిలో మస్కా సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు రామ్.
మళ్లీ ఇన్నేళ్లకు Red Movie తో సంక్రాంతి సీన్ లోకి ఎంటరయ్యాడు ఎనర్జిటిక్ స్టార్. సంక్రాంతి సీజన్ ఈ హీరోకు సక్సెస్ ఇస్తుందా ఇవ్వదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.