షాక్ ఇవ్వబోతున్న రామ్

Wednesday,February 26,2020 - 01:17 by Z_CLU

సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుడే రిలీజ్ డేట్ చెప్పేశాడు రామ్. చెప్పినట్టుగానే రెడ్ సినిమాను చకచకా పూర్తిచేశాడు. అలా షార్ట్ టైమ్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయింది. అంతేకాదు, మరో 2 రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్ కూడా అఫీషియల్ గా ప్రారంభం కాబోతోంది. ఎల్లుండి (28న) రెడ్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

తమిళ్ లో హిట్టయిన తడమ్ సినిమా ఆధారంగా తెరకెక్కుతోంది రెడ్. కెరీర్ లో తొలిసారి రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఈ సినిమాలో. ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరక్ట్ చేస్తున్నాడు. రామ్ షేడ్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోయే టీజర్ లో చూపించబోతున్నారు. తన గెటప్స్ తో రామ్ షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఈ సినిమాకు సంబంధించి ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. వచ్చే వారం ఈ ఒక్క పాటను రామోజీ ఫిలింసిటీలో పూర్తిచేయబోతున్నారు. నివేత పెతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారు.