డిఫరెంట్ కాన్సెప్ట్ తో సుమంత్ అశ్విన్ సినిమా

Wednesday,February 26,2020 - 01:03 by Z_CLU

నలుగురు అపరిచితులు..
3,450 కిలోమీటర్ల దూరం రోడ్డుపై ప్రయాణం
వాళ్ల ప్రయాణం దేని కోసం..
ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేమిటి?..

ఈ డిఫరెంట్ కాన్సెప్టుతో గురుప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ సినిమా రాబోతోంది. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా రాబోతున్న ఈ సినిమా ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో లాంఛ్ అయింది. నిర్మాత జి. మహేష్. నలుగురు అపరిచితులుగా సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని నటిస్తున్నారు.

రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, నగేష్ కుకునూర్ వంటి దర్శకుల వద్ద పనిచేసిన గురు పవన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. మార్చి 2న తొలి షెడ్యూలు, మార్చి 22 నుంచి రెండో షెడ్యూలు జరుగుతాయి. హైదరాబాద్, ఝాన్సీ, నాగపూర్, గ్వాలియర్, మనాలి వంటి లొకేషన్లలో షూటింగ్ చేస్తారు. రాంప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.

నటీనటులు:
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని, అమ్మ అభిరామి, నాజర్, పృథ్వీ, ఈశ్వరీ రావు, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్, భాను అవిరినేని, అజయ్ ఘోష్, భద్రం.

సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గురుపవన్
నిర్మాత: జి. మహేష్
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
సంగీతం: సునీల్ కశ్యప్
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి
ఫైట్స్: పృథ్వీరాజ్
సంభాషణలు: మీరఖ్, ప్రవీణ్ బొట్ల
బ్యానర్: గురుప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్