యూట్యూబ్ లో స్పైడర్ సంచలనాలు

Friday,June 02,2017 - 01:31 by Z_CLU

మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్. ఈ సినిమా తన ఫస్ట్ లుక్ టీజర్ తో దుమ్ముదులిపింది. ఎవరి అంచనాలకు అందని రీతిలో, ఊహించని విధంగా వచ్చిన స్పైడర్ టీజర్ చూసి ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతి ఒక్కరు తమ ట్వీట్స్ ద్వారా స్పైడర్ ను తెగ మెచ్చుకుంటున్నారు. అలా యునానిమస్ టాక్ తో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది స్పైడర్ సినిమా.

కేవలం 5 గంటల్లోనే యూట్యూబ్ లో స్పైడర్ టీజర్ కు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. టీజర్ లో గ్రాఫిక్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ కు 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ కౌంట్ గంట గంటకు పెరుగుతూనే ఉంది. మహేష్ సినిమాపై ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి ఈ నంబర్స్ చాలు.

మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది స్పైడర్ సినిమా. మహేష్ ఇందులో గూఢచారిగా కనిపించబోతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ప్రముఖ దర్శకుడు,నటుడు ఎస్ జే సూర్య ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడు.