జూన్ 8 నుంచి రామ్ చరణ్ సినిమా షూటింగ్

Friday,June 02,2017 - 02:37 by Z_CLU

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ డీటెయిల్స్ తెలిశాయి. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఈనెల 8 నుంచి సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ లండన్ లో ఉన్నాడు. రేపు లండన్ నుంచి హైదరాబాద్ చేరుకుంటాడు. 8వ తేదీ నుంచి మూవీని సెట్స్ పైకి తీసుకొస్తాడు.

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చెర్రీ కొత్త సినిమా షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా కోసం అక్కడ భారీ సెట్ నిర్మించారు. అందులో రామ్ చరణ్ తో ఇంట్రడక్షన్ సాంగ్ తీయబోతున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు. ఏ టైటిల్ పెట్టాలనే నిర్ణయాన్ని పూర్తిగా సుకుమార్ కే అప్పగించాడు రామ్ చరణ్.

ఈ సినిమాతో చెర్రీ సరసన ఫస్ట్ టైం నటిస్తోంది హీరోయన్ సమంత. వీళ్లిద్దరి కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 80ల నాటి పల్లెటూరి ప్రేమకథతో సుకుమార్-చరణ్ సినిమా తెరకెక్కుతోంది.