మరికొన్ని గంటల్లో స్పైడర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Thursday,September 14,2017 - 11:00 by Z_CLU

మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. శిల్పకళా వేదికలో సాయంత్రం అట్టహాసంగా జరగనున్న ఈ భారీ ఈవెంట్ ను జీ సినిమాలు ఛానెల్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి జీ సినిమాలు ఛానెల్ లో స్పైడర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను లైవ్ లో చూడొచ్చు.

స్పైడర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన “గ్లింప్స్ ఆఫ్ స్పైడర్” సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత విడుదల చేసిన టీజర్ కు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రయిలర్ కు కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. రాత్రి 12 గంటలకు విడుదలైన ఈ ట్రయిలర్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. దీంతో స్పైడర్ పై భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా జరగనుంది ప్రీ-రిలీజ్ వేడుక.

మురుగదాస్-మహేష్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ సినిమా ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ అదరగొట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా బాహుబలి-2 తర్వాత అత్యథిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమాగా స్పైడర్ రికార్డు సృష్టించింది. దసరా కానుకగా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది స్పైడర్. తెలుగు, తమిళ, హిందీ, అరబ్బీ భాషల్లో స్పైడర్ వస్తోంది.