సింగిల్ సాంగ్ కు 5 మిలియన్ వ్యూస్

Friday,June 02,2017 - 12:30 by Z_CLU

సోషల్ మీడియాలో డీజే సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే టీజర్ తో టాలీవుడ్ రికార్డుల్ని షేక్ చేసిన బన్నీ.. తాజాగా సింగిల్ తో మరో రేర్ ఫీట్ సొంతం చేసుకున్నాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా నుంచి విడుదలైన గుడిలో, బడిలో అనే పెప్పీసాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది. మే 29న విడుదలైన ఈ సాంగ్ కు అప్పుడే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక సింగిల్ కు ఇంత తక్కువ టైమ్ లో 50లక్షల వ్యూస్ రావడం టాలీవుడ్ లో ఓ రికార్డు.

బన్నీ, పూజా హెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, హీరోహీరోయిన్ల కూల్ స్టెప్పులు, అబుదాబి అందాలు, డీఎస్పీ కూల్ మ్యూజిక్ ఈ పాటను సంథింగ్ స్పెషల్ గా మార్చేశాయి. ఇదే ఊపులో సినిమాలోని మిగతా పాటల్ని కూడా వీలైనంత తొందరగా విడుదల చేయాలని ఫిక్స్ అయింది యూనిట్.

డీజే సినిమాకు అఫీషియల్ కౌంట్ డౌన్ ఆల్ మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే జూన్ నెల ప్రారంభం అయింది. ఈ నెలలోనే 23వ తేదీన సినిమా థియేటర్లలోకి రాబోతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న డీజే సినిమాకు దిల్ రాజు నిర్మాత.