రవితేజ, శ్రీనువైట్ల సినిమా ప్రారంభం

Thursday,March 08,2018 - 11:42 by Z_CLU

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో కొత్త సినిమా ఈరోజు ప్రారంభమైంది. శ్రీను వైట్ల కూతురు ఆనంది ఈ సినిమాకు క్లాప్ కొడితే, మరో కూతురు ఆద్య, కెమెరా స్విచాన్ చేసింది. అలా సందడిగా వైట్ల-రవితేజ మూవీ ప్రారంభమైంది. సినిమాకు అమర్-అక్బర్-ఆంటోనీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

రవితేజ ఇందులో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. మూడు డిఫరెంట్ గెటప్స్ కాదు, ఏకంగా ముగ్గురు రవితేజలు కనిపించబోతున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు. మరో ఇద్దర్ని సెలక్ట్ చేయాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

కథ ప్రకారం సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అమెరికాలో జరగనుంది. ఈ మేరకు శ్రీనువైట్ల ఇప్పటికే అమెరికా వెళ్లి లొకేషన్లు ఫైనలైజ్ చేసి వచ్చాడు. ఈ మూవీలో హీరో సునీల్ ఓ కామిక్ రోల్ చేయబోతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.