మార్చి 10న నాని ‘కృష్ణార్జున యుద్ధం’టీజర్

Thursday,March 08,2018 - 12:32 by Z_CLU

నాని డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఏప్రియల్ 12 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే  2 సింగిల్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఎల్లుండి (మార్చి 10న) ఈ సినిమా టీజర్ రాబోతోంది.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సక్సెస్ మోడ్ లో ఉన్న నానిని, కృష్ణార్జున యుద్ధం సినిమాతో 2 సరికొత్త యాంగిల్స్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. కృష్ణ అనే మాస్ క్యారెక్టర్, అర్జున్ అనే క్లాస్ పాత్రలో నాని మెస్మరైజ్ చేయబోతున్నాడు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వన్, రుక్సార్ మిర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హిపాప్ తమిజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.