'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ రివ్యూ

Tuesday,October 03,2023 - 02:59 by Z_CLU

మరో 17 రోజుల్లో ‘టైగర్’ హంట్ ప్రారంభమవుతుంది. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో,  వంశీ దర్శకత్వంలో  రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. గత కొద్ది రోజులుగా సినిమాలోని ప్రముఖ పాత్రలందరినీ ఒక్కొక్కటిగా పరిచయం చేసిన మేకర్స్, మోస్ట్ వాంటెడ్ దొంగలకు స్థావరంగా ఉన్న స్టువర్ట్‌పురం వరల్డ్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రోరింగ్ ట్రైలర్‌తో వచ్చారు. ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.

నాగేశ్వరరావు రాకతో రాబరీ పద్దతులు మారిపోయాయి. అతనికి అధికారం దాహం, స్త్రీలపై కాంక్ష, డబ్బు కోసం వ్యామోహం ఉంది. ఎవరినైనా కొట్టడానికి, ఏదైనా దోచుకోవడానికి ముందు హెచ్చరికలు చేయడం కూడా అతనికి అలవాటు. అయితే, నాగేశ్వరరావును ఎలిమినేట్ చేయడానికి ఒక బ్యాడ్  పోలీసు వస్తాడు. స్టూవర్టుపురం నాగేశ్వరరావు కథ అతని అరెస్టుతో ముగిసింది, అయితే టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడి నుండి ప్రారంభమవుతుంది.  నేషనల్ థ్రెట్ గా మారిన టైగర్ నాగేశ్వరరావు నెత్తుటి వేట సాగుతుంది.

రెండున్నర నిమిషాల ట్రైలర్ లో నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. టైటిల్ రోల్‌లో రవితేజ యంగ్‌గా, డైనమిక్‌గా, వైల్డ్, బ్రూటల్ గా కనిపించారు. మాసీ రోల్ లో రవితేజ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది.  ప్రతి నటుడికీ నటించడానికి ఒక స్పేస్, స్కోప్ వుంది. నూపుర్ సనన్,  గాయత్రి భరద్వాజ్ ఫీమేల్  లీడ్ గా కనిపించారు, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాజర్, జిషు సేన్‌గుప్తా, హరీష్ పెరడి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.

టైగర్ నాగేశ్వరరావు యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. దర్శకుడు వంశీ కథ ని చూపించిన విధానం యునిక్ గా వుంది. రవితేజ స్టార్ చరిష్మాకు తగినట్లుగా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్. యాక్షన్ కొరియోగ్రఫీ వరల్డ్ క్లాస్. ఆర్ మదీ తీసిన విజువల్స్ గ్రాండ్, టెర్రిఫిక్ గా ఉన్నాయి, జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు. అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. ట్రైలర్ సినిమా పై అంచనాలని మరింత పెంచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి మయాంక్ సింఘానియా సహ నిర్మాత.