RAVITEJA 'టైగర్ నాగేశ్వరరావు' రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,March 29,2023 - 05:09 by Z_CLU

Raviteja ‘Tiger Nageswara Rao’ Releasing Worldwide Grandly On October 20th

మాస్ మహారాజా రవితేజ హీరోగా  వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ యేడాది విడుదల కాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ లలో ఒకటి. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌ బస్టర్‌ లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌ తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 5 ఎకరాల స్థలంలో సినిమా కోసం స్టువర్టుపురం గ్రామాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ బడ్జెట్‌ ను కేటాయించారు.

తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేశారు.  అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల అవుతుందని పోస్టర్ తో ప్రకటించారు. దసరా నుంచి టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వేట ప్రారంభమవుతుంది. దసరా బిగ్గెస్ట్ సీజన్  . దీంతో ఈ సినిమాకు  లాంగ్ ఫెస్టివల్ హాలిడేస్ కలసిరానున్నాయి. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో టైగర్ నాగేశ్వరరావు గెటప్‌ లో పొగలు కక్కుతున్న రైలు పై నిలబడి కనిపించారు రవితేజ.

టైగర్ నాగేశ్వరరావు 1970 ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది.  ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.