రవితేజ కరియర్ లోనే ఫస్ట్ టైమ్

Thursday,November 08,2018 - 05:36 by Z_CLU

త్వరలో V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాతో సెట్స్ పైకి రానున్నాడు రవితేజ. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ నెల 13 న ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా సైంటిఫిక్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనుంది.

రవితేజ సినిమాలంటేనే మాస్ ఎలిమెంట్స్. దానికి తోడు అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ ఉంటేనే అది రవితేజ మార్క్ సినిమా. అయితే ఈ సినిమా మాత్రం కాస్త డిఫెరెంట్ గా ఉండబోతుంది. గతంలో ‘ఒక్క క్షణం’ అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో హిట్ కొట్టిన V.I. ఆనంద్ ఈ సారి కూడా అదే తరహా సైంటిఫిక్ ఎలిమెంట్స్ తో కథను రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో రవితేజ మార్క్ మాస్ హిలేరియస్ ఎలిమెంట్స్ ఉంటాయా లేదా..? లేకపోతే కంప్లీట్ గా ఇది స్టోరీ బేస్డ్ ఎంటర్ టైనర్ కానుందా అనే విషయాలు పక్కన పెడితే, ఈ జోనర్ లో నటించడం రవితేజ కరియర్ లోనే ఫస్ట్ టైమ్. గతంలో ‘నేల టిక్కెట్టు’ సినిమాని నిర్మించిన రామ్ తాళ్ళూరి ఈ సినిమాని SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.