Raviteja లిస్టులో మరో దర్శకుడు ?

Monday,September 12,2022 - 04:41 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘ధమాకా’ , ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘#MEGA154’ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత కూడా లైనప్ రెడీగా ఉందని తెలుస్తుంది. మొన్నటి వరకూ రవితేజ నెక్స్ట్ లిస్టులో  ఘట్టమనేని కార్తీక్ పేరు వినిపించగా ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు లిస్టులో చేరింది. సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని , స్క్రిప్ట్ కూడా ఫినిష్ అయిందని అంటున్నారు. సంపత్ నంది తో ‘బెంగాల్ టైగర్’ అనే సినిమా చేశాడు రవితేజ. ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఆ తర్వాత ఈ కాంబో సినిమా మీద చాలా వార్తలు వచ్చాయి. కానీ ఏది మెటిరియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ కాంబో సినిమా ఫిక్సయిందని సమాచారం.

తాజాగా సంపత్ నంది రవితేజకి స్క్రిప్ట్ నెరేట్ చేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న మాస్ మహారాజా ముందుగా  కార్తీక్ తో సినిమా చేస్తాడా ?లేదా సంపత్ నంది సినిమాను ముందుకు తెస్తాడా ? ఒకవేళ రెండు సినిమాలు ఒకే సారి చేసే ఆలోచన  ఉందా తెలియాల్సి ఉంది. త్వరలోనే రవితేజ నెక్స్ట్ సినిమాపై అప్ డేట్ రానుంది.