మెగాహీరో సరసన నిధి అగర్వాల్

Thursday,November 08,2018 - 04:31 by Z_CLU

త్వరలో సెట్స్ పైకి రానుంది  సాయి  ధరమ్  తేజ్  తమ్ముడు  వైష్ణవ్ తేజ్ సినిమా. రీసెంట్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది.  అయితే ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఫిక్సయిందనే న్యూస్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

రీసెంట్ గా నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాలో మెస్మరైజ్ చేసిన నిధి, ఈ సినిమా రిలీజ్ కి ముందే అఖిల్ సరసన Mr. మజ్నులో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది, అప్పుడే వైష్ణవ్ తేజ్ సినిమాలోను నటించే చాన్స్ కొట్టేసింది.

ఈ విషయం అఫీషియల్ గా కన్ఫమ్ అయితే కాలేదు కానీ, సినిమా యూనిట్ నిధి అగర్వాల్ నే మోస్ట్ ప్రిఫర్డ్ లిస్ట్  లో ఉంచినట్టు తెలుస్తుంది. మరి ఈ టాక్ అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా..? జస్ట్ రూమర్ గా మిగిలిపోతుందా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఈ సినిమా సానా బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనుంది.