అప్పుడు ఇలియానా.. ఇప్పుడు శృతి హాసన్

Friday,November 01,2019 - 09:03 by Z_CLU

రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది శృతి హాసన్. గతంలో కూడా వీళ్ళిద్దరూ జతగా ‘బలుపు’ చేశారు. అంతవరకు ఓకె… కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్స్ డిఫెరెంట్. శృతి హాసన్ మూడేళ్ళ గ్యాప్ తరవాత తెలుగు సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ఇంత మంది ఉండగా మేకర్స్, శృతినే ఎందుకు ప్రిఫర్ చేశారు అన్నది అప్రస్తుత కానీ, ఈ సినిమాతో శృతి ట్రాక్ లో పడుతుందా..? లేకపోతే ‘ఇలియానా’ లాగా సైడై పోతుందా..?

మంచి క్రేజ్ లో ఉన్న టైమ్ లో శృతి తన సింగింగ్ కరియర్ పై దృష్టి పెట్టింది. పనిలో పనిగా ఓ హాలీవుడ్ సిరీస్ లో కూడా నటించేసింది. అయితే ఈ టైమ్ లో శృతికి, తెలుగు ఆడియెన్స్ కి మధ్య న్యాచురల్ గానే చిన్న గ్యాప్ క్రియేట్ అయింది. ఇలియానా విషయంలో కూడా జరిగిందదే. ఈ భామ కూడా రీ ఎంట్రీకి ఎంచుకున్న సినిమా రవితేజదే.

బాలీవుడ్ కరియర్ పై ఫోకస్ చేయడం, ఈ లోపు ఇలియానా తెలుగు సినిమాలకి ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేసిందన్న టాక్, ఇలియానా టాలీవుడ్ కరియర్ పై పెద్ద ఇంపాక్టే చూపించింది. దానికి తోడు ఆశలు పెట్టుకున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకోలేకపోవడంతో, ఇలియానా ఇన్నాళ్ళకు ఓ సినిమా చేసింది అనే బజ్ కూడా క్రియేట్ చేసుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు శృతి విషయంలో ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.

గ్యాప్ తరవాత వస్తున్న సినిమా కాబట్టి శృతి రాంగ్ డెసిషన్ తీసుకునే చాన్స్ అస్సలులేదు. అందునా మేకర్స్ కూడా పర్టికులర్ గా శృతిని ఎంచుకున్నారు అంటే, రీజన్ కూడా అంతే స్ట్రాంగ్ అయి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు తేలాల్సిందల్లా శృతి ఈ సినిమాతో నిలబడుతుందా..?