విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ రూట్ క్లియర్

Thursday,November 08,2018 - 06:36 by Z_CLU

సెన్సార్ క్లియర్ చేసుకుంది విజయ్ దేవరకొండ టాక్సీవాలా. నవంబర్ 17 న రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సైంటిఫిక్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ U/A సర్టిఫికెట్ పొందింది. అగ్రెసివ్ మోడ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న ‘టాక్సీవాలా’ ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ తనకు నచ్చిన ఉద్యోగం దొరక్క, తనకున్న బడ్జెట్ లో ఒక టాక్సీ కొనుక్కుని కరియర్ ని బిగిన్ చేయడంతో స్టార్ట్ అయ్యే ఈ టాక్సీవాలా సినిమా, కంప్లీట్ ఫన్ రైడ్ లా ఉండబోతుంది అంటున్నారు ఫిల్మ్ మేకర్స్.

టాక్సీకి, ఆ టాక్సీవాలా గా కనిపించనున్న విజయ్ దేవరకొండకి మధ్య జరిగే సిచ్యువేషన్స్ సినిమాలో హైలెట్ కానున్నట్టు తెలుస్తుంది. రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కంపోజర్. S.K.N. నిర్మించిన ఈ సినిమా, గీతా ఆర్ట్స్ 2, UV పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కింది.