కొత్తవారి కోసం 'Ravi Teja Works' !

Wednesday,February 17,2021 - 12:40 by Z_CLU

టాలీవుడ్ లో ఎంతో కష్టపడి పైకొచ్చిన హీరోల్లో మెగా స్టార్ చిరంజీవి తర్వాత అందరు మాట్లాడుకునేది రవితేజ గురించే. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుండి స్టార్ హీరో స్టేటస్ అందుకున్న మాస్ మహారాజా లైఫ్ కొత్తవాళ్ళకి ఆదర్శం. అయితే తనను  ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళ కోసం రవితేజ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేయబోతున్నాడట. ఇప్పటికే ‘RT Works’ అనే బేనర్ ను ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడని సమాచారం.

ఈ బేనర్ మీద కొత్త వాళ్ళతో కొన్ని కాన్సెప్ట్ సినిమాలు చేయబోతున్నాడట రవితేజ. కాకపోతే తన బేనర్ లో తెరకెక్కె సినిమాల్లో తను నటించబోనని సన్నిహితులతో మాస్ మహారాజా షేర్ చేసుకున్నాడని టాక్. ప్రస్తుతం హీరో  నాని కూడా తన మిత్రురాలితో కలిసి ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే బేనర్ పెట్టి కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే RT వర్క్స్ నుండి కూడా అలాంటి సినిమాలు రాబోతున్నాయన్నమాట. ఈ బేనర్ లో రవితేజ వెబ్ సిరీస్ లు కూడా నిర్మించానున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఓ మంచి రోజు చూసి రవితేజ తన బేనర్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Also Read వరుణ్ తేజ్ ‘గని’ పోస్ట్ పోన్ ?