రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' కాన్సెప్ట్ పోస్టర్ - అదిరింది

Wednesday,August 15,2018 - 10:10 by Z_CLU

ఇండిపెండెన్స్ డే సందర్బంగా రవితేజ కొత్త సినిమా అమర్ అక్బర్ ఆంటోని కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్, హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ 3  డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు.

శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ అనగానే ఆడియెన్స్ లో క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ ని మరింత రేజ్ చేసేలా  ఉంది ఈ పోస్టర్. డైమండ్ షేప్ లో ఈ సినిమా టైటిల్ ని డిజైన్ చేసిన ఫిల్మ్ మేకర్స్, పోస్టర్ లో రిటర్న్ గిఫ్ట్ అని మెన్షన్ చేయడం, దాంతో పాటు పోస్టర్ లో ఉన్న 2 బొమ్మలు మాస్క్ వేసుకుని ఉండటంతో, సినిమా స్టోరీలైన్ ఏమై ఉంటుందనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో రేజ్ అవుతుంది.

ప్రస్తుతం కంప్లీట్ కాన్సంట్రేషన్ ఫిల్మ్ మేకింగ్ పై పెట్టిన ఫిల్మ్ మేకర్స్, త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. S.S. తమన్ మ్యూజిక్ కంపోజర్.