NTR 'అరవింద సమేత' టీజర్ రివ్యూ

Wednesday,August 15,2018 - 09:51 by Z_CLU

NTR అరవింద సమేత టీజర్ రిలీజయింది. భారీ అంచనాల మధ్య త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ యాక్షన్ ఎంటర్ టైనర్. అయితే రీసెంట్ గా రిలీజైనNTR లుక్స్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తే, 0:52  సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ సినిమాలో NTR క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తుంది.

‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టా ఉంటుందో తెలుసా…?’ అంటూ జగపతి బాబు వాయిస్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తుంది టీజర్. NTR  ని కంప్లీట్ గా మాస్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేస్తున్న ఈ టీజర్ లో NTR  చెప్పిన  ‘ కంట పడ్డావా కనికరిస్తానేమో… ఎంట పడ్డానా నరికేస్తా’ డైలాగ్  ఫ్యాన్స్ కి  చాలా నచ్చచేసింది. మొత్తానికి ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజైన ఈ టీజర్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలిమెంట్ లా మారింది.

ఈ సినిమా దసరా కి రిలీజ్ కానుంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో NTR సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.