టచ్ చేసి చూడు

Wednesday,January 25,2017 - 02:23 by Z_CLU

మాస్ మహారాజ్ రవి తేజ ఇటీవలే కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే.. 2015 లో ‘బెంగాల్ టైగర్’ సినిమా తర్వాత మరో సినిమాను సెట్స్ పై పెట్టకుండా టూర్స్ లో ఎంజాయ్ చేసిన రవితేజ ప్రెజెంట్ ఓ రెండు సినిమాలను అనౌన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుండడంతో ‘జనవరి 26’ న తన బర్త్ డే సందర్భంగా ఆ రెండు సినిమాలను అనౌన్స్ చేయబోతున్నాడట.

ఈ రెండు సినిమాలలో ఒకటి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయబోతున్న మాస్ మహారాజ్… మరో సినిమాను రైటర్ విక్రమ్ సిరి డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహ బ్యానర్ లో చేయబోతున్నాడు. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఓ బ్లైండ్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయబోతున్న రవి తేజ… విక్రమ్ సిరి సినిమాలో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం. రాశిఖన్నా హీరోయిన్ గా సెలక్ట్ అయిన ఈ సినిమాకు “టచ్ చేసి చూడు” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ ఈ రెండు సినిమాలతో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు మాస్ మహారాజ్.

touch-chesi-chudu

ravi-teja-zee-cinemalu