ముహూర్తం ఖరారు....

Wednesday,January 25,2017 - 03:16 by Z_CLU

బాబీ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూసిన ఫాన్స్ కి ఎట్టకేలకి గుడ్ న్యూస్ చెప్పేసాడు తారక్. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

కెరీర్ లో ఫస్ట్ టైం మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఈ సినిమాలో ఎంటర్టైన్ చేయబోతున్నాడట ఎన్టీఆర్. ఇప్పటికే ఈ మూడు క్యారెక్టర్స్ కి సంబంధించి గెటప్స్ కూడా ఫైనల్ చేసేసారట యూనిట్. ఈ మూడు క్యారెక్టర్స్ లో ఒకటి చాలా పవర్ ఫుల్ గ అంటుందని ఆ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ను బాబీ సరి కొత్తగా చూపించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు యూనిట్.