లక్ చెక్ చేసుకుంటున్న హన్సిక

Wednesday,January 25,2017 - 01:15 by Z_CLU

అప్పుడెప్పుడో 2014 లో రవితేజ ‘పవర్’ సినిమాలో కనిపించిన హన్సిక మళ్ళీ తెలుగు స్క్రీన్ పై కనిపించలేదు. 2015 లో అనుష్క సైజ్ జీరో సినిమాలో కామియో అప్పియరెన్స్ తో పలకరించేశాను అనిపించుకున్నా, ఈ రెండేళ్ళు టాలీవుడ్ అకౌంట్ లో హన్సిక ఆబ్సెంట్ అయినట్టే.

లాస్ట్ ఇయర్ సెట్స్ పైకి వచ్చిన లక్కున్నోడు సినిమాతో మళ్ళీ టాలీవుడ్ టికెట్ కొనుక్కున్న హన్సిక, ఈ సినిమాతో టాలీవుడ్ లోను బ్యాక్ టు ఫాం అవ్వడానికి ట్రై చేస్తుంది.

రాజ్ కిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లక్కున్నోడు జనవరి 26 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీగా అవుతుంది. ముచ్చటగా మూడోసారి విష్ణుతో జతకట్టిన హన్సిక లక్కున్నోడు సక్సెస్ తో మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయమని సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంది.