సంక్రాంతి కి 'రంగస్థలం' ట్రైలర్ ?

Sunday,November 12,2017 - 02:37 by Z_CLU

క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం ‘ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… 1985 లో జరిగే కథతో విలేజ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఫాస్ట్ ఫేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ ప్రస్తుతం మార్చ్ లో సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ముందుగా ప్రకటించిన సంక్రాంతి కి ఈ సినిమా సినిమా రిలీజ్ కావట్లేదు కాబట్టి ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను సంక్రాంతి కి రిలీజ్ చేసే ప్లాన్ ఉందట యూనిట్.

సంక్రాంతి కానుకగా ఓ రెండు రోజుల ముందే ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసి జనవరి 10న రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు థియేటర్స్ ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. మరి ఈ వార్త నిజమైతే కనుక మెగా ఫాన్స్ కి ఈ సంక్రాంతి మెమొరీబుల్ ఫెస్టివల్ గా మారబోతుందనడంలో సందేహం లేదు.