సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'రంగస్థలం' టీజర్

Thursday,January 25,2018 - 03:07 by Z_CLU

నిన్న రిలీజైన ‘రంగస్థలం’ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. రామ్ చరణ్ ని నెవర్ సీన్ బిఫోర్ క్యారెక్టరైజేషన్ లో ప్రెజెంట్ చేయనున్న ఈ సినిమాకి ఫ్యాన్స్ లో ఏ రేంజ్ డిమాండ్ క్రియేట్ అయి ఉందో, ఈ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థమైపోతుంది. కనీసం 24 గంటలు కూడా గడవకముందే ఏకంగా 8 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ‘రంగస్థలం’ టీజర్.

రామ్ చరణ్ సరసన సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతి ఎలిమెంట్ కొత్తగా ఉండబోతుంది. సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం సినిమాలో మోస్ట్ ఎట్రాక్టివ్ ఎలిమెంట్ అయితే, మెగా పవర్ స్టార్ చెవిటి వాడిలా నటిస్తున్న ఈ సినిమాలో చాలెంజింగ్ కాంఫ్లిక్ట్ ఏమై ఉంటుందా అనే క్యూరాసిటీ ఫ్యాన్స్ లో అప్పుడే బిగిన్ అయిపోయింది.

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆది పినిశెట్టి కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. మార్చి 30 న సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.