ఫ్రైడే రిలీజ్

Thursday,January 25,2018 - 04:18 by Z_CLU

రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది అనుష్క భాగమతి. హారర్ ఎలిమెంట్స్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అశోక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ అనుష్క కరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అనిపించుకోవడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

అనుష్కని రౌద్ర రూపంలో ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాలో భారీ బడ్జెట్ తో నిర్మించిన భాగమతి బంగ్లా ఎట్రాక్టివ్ ఎలిమెంట్ లా నిలుస్తుంది. ఇప్పటికే ట్రైలర్ తో మ్యాగ్జిమం ఇంప్రెస్ చేసిన సినిమా యూనిట్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది.

తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది.   ఉన్ని ముకుందన్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మించారు.