సమంతా ‘U’ టర్న్ లో ఆది పినిశెట్టి

Thursday,January 25,2018 - 12:50 by Z_CLU

ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుండి సెట్స్ పైకి రానుంది సమంతా ‘U’ టర్న్. కన్నడలో సూపర్ హిట్టయిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు ఆది పినిశెట్టి.

ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో కీ రోల్ కోసం ఇప్పటికే శ్రియ, భూమికను సంప్రదించిన సినిమా యూనిట్, ఫైనల్ కన్ఫర్మేషన్ ని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి పవన్ కుమార్ డైరెక్టర్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళం లోను అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.