'నేనే రాజు నేనే మంత్రి' షూటింగ్ పూర్తి

Thursday,June 15,2017 - 02:03 by Z_CLU

‘బాహుబలి’తో ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు అందుకున్న దగ్గుబాటి రానా లేటెస్ట్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జోగేంద్ర అనే రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు రానా.

తాజాగా రానా-కాజల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్ ఈ షెడ్యూల్ తో మొత్తం సినిమా కంప్లీట్ అయినట్టు ప్రకటించారు. తేజ పవర్ ఫుల్ స్క్రీన్ ప్లే, లక్ష్మి భూపాల్ అందించిన మాటలు, రానా క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్ అట.

తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో “నేనే రాజు నేనే మంత్రి” సినిమాపై  అంచనాలు పెరిగాయి. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో  సినిమాను విడుదల చేయబోతున్నారు.