నాని 'నిన్ను కోరి' ట్రేలర్ రిలీజ్ డేట్

Thursday,June 15,2017 - 12:55 by Z_CLU

నాని ‘నిన్ను కోరి’ ట్రేలర్ రిలీజ్ కి డేట్ సెట్ అయింది. ఎల్లుండి (జూన్ 17) ఉదయం సరిగ్గా 10 గంటలకు ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్. సినిమాను వచ్చేనెల 7న థియేటర్లలోకి తీసుకురానున్నారు.

నిన్ను కోరి ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్యే సినిమాకు సంబంధించి 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ట్రయిలర్ తో ప్రమోషన్ ను మరింత పెంచాలని భావిస్తున్నారు. శివ నిర్వాణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు.

కథ ప్రకారం U.S. లో మ్యాగ్జిమమ్ షూటింగ్ చేశారు. 90శాతం సినిమా అమెరికా బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తుంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాను నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.