హాట్ టాపిక్ గా మారిన రానా పెళ్ళి

Thursday,July 20,2017 - 06:27 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా కంప్లీట్ కాన్సంట్రేషన్ కరియర్ పైనే ఉంది. ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రానా,  రీసెంట్ గా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు. ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ కి ఓపిగ్గా సమాధానం చెప్పిన రానా, పెళ్ళెప్పుడు అని అడిగిన క్వశ్చన్ కి డిఫెరెంట్ గా రియాక్ట్ అయ్యాడు.

‘ప్రభాస్, నితిన్ నాకన్నా సీనియర్స్,  వాళ్ళ పెళ్లి తరవాత నేను చేసుకుంటాను. ఇంట్లో కూడా నాకు పెళ్లి ప్రెజర్ పెద్దగా లేదు’ అని చెప్పాడు రానా. బాహుబలి తరవాత చాలా మంది దృష్టి రానా, ప్రభాస్ సినిమాలు.. వాటి నుండి కాస్త పక్కకు వస్తే ఈ  హ్యాండ్ సమ్ హంక్స్  పెళ్లి పైనే ఉంది. మరి జస్ట్ కరియరే అని ట్యాగ్ లైన్ ని క్రాస్ చేసి రానా పెళ్ళి పై ఎప్పుడు దృష్టి పెడతాడో చూడాలి.