రానా కొత్త సినిమా అప్ డేట్స్

Sunday,December 30,2018 - 12:19 by Z_CLU

వచ్చే ఏడాది వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు రానా. తన సొంత బ్యానర్ లో గుణశేఖర్ డైరెక్షన్ లో ‘హిరణ్య’ సినిమా చేయబోతున్న రానా వచ్చే ఏడాది ‘విరాటపర్వం 1992’ అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ‘నీది నాదీ ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఉడుగుల ఇప్పటికే రానా కి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించనున్న ఈ సినిమా దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది.