జనవరిలో సెట్స్ పైకి రానున్న రానా ‘హాథీ మేరే సాథీ’

Thursday,December 14,2017 - 01:02 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తరవాత రానా నెక్స్ట్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయి ఉంది. ఒక పర్టికులర్ ఇమేజ్ కి స్టిక్ అవ్వకుండా డిఫెరెంట్ సినిమాలను చూజ్ చేసుకుంటూ వెళ్తున్న రానా, ఈ రోజు 33 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ సినిమా ’హాథీ మేరే సాథీ’ టైటిల్ లోగోను రిలీజ్ చేశాడు. జనవరి లో సెట్స్ పైకి రానున్న ఈ సినిమా ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

2018 దీపావళికి ఏ సినిమాని రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న సినిమా యూనిట్, థాయ్ లాండ్ లో ఫస్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. థాయ్ లాండ్ తో పాటు ఇండియాలోనూ కొన్ని ఎగ్జోటిక్ లొకేషన్స్ ఈ సినిమా తెరకెక్కనుంది. రాజేష్ ఖన్నా హీరోగా నటించిన హిందీ క్లాసిక్  ‘హాథీ మేరే సాథీ’ సినిమాకి ట్రిబ్యూట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ తో ఇన్స్పైర్ అయిన కొత్త స్టోరీలైన్ అని తెలుస్తుంది.

ప్రభు సాల్మన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ‘ఈరోస్ ఇంటర్నేషనల్ ట్రినిటీ పిక్చర్స్’ బ్యానర్ పై తెరకెక్కనుంది.