రానా ఇంటర్వ్యూ

Thursday,August 10,2017 - 05:20 by Z_CLU

రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఈ ఫ్రైడే  రిలీజవుతుంది. సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న రానా, ఈ సినిమాకి సంబంధించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

రియలిస్టిక్ గా…

అల్టిమేట్ కమర్షియల్ వ్యాల్యూస్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాధా జోగేంద్ర ల లవ్ స్టోరీ. ఒక కమర్షియల్ సినిమాని చాలా సింపుల్ గా, మనకు మన రెగ్యులర్ వాతావరణంలో మనకు తెలిసిన మనుషుల్లాంటి మనషుల మధ్య, పరిస్థితుల మధ్య రియలిస్టిక్ గా తెరకెక్కించడం జరిగింది.

 

వేరియేషన్ అవసరమే…

నా కరియర్ గ్రాఫ్ చూసుకుంటే ఒక సినిమాతో ఇంకో సినిమాకు అసలు సంబంధం ఉండదు. అసలు ఒక కథ వింటున్నాను అంటే, కథ ఏంటి అనే దాన్నికన్నా, చేసిన సినిమాల కన్నా డిఫెరెంట్ గా ఉందా లేదా అన్నదే ఆలోచిస్తాను, ఒకసారి ఆ విషయంలో క్లారిటీ వచ్చాకే కథ తెలుసుకుంటాను… సినిమా సినిమాకి వేరియేషన్ కంపల్సరీ…

ఈ సినిమాకే ఎక్కువ కష్టపడ్డాను

తేజ గారి సినిమాలు చాలా న్యాచురల్ గా ఉంటాయి. సినిమా సెట్స్ పైకి వెళ్ళే ముందు ఆయన రేజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే.. ఎక్కడో ఊళ్ళో వడ్డీ వ్యాపారం చేసుకునే జోగేంద్రకి జిమ్ బాడీ ఉండకూడదు.. ఈ కండలు.. అన్నీ అసలు జోగేంద్రకి మ్యాచ్ అవ్వవు… అక్కడ మొదలయ్యాయి అసలు కష్టాలు.. రియలిస్టిక్ గా కనబడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఆరు సంవత్సరాల జర్నీ…

నేనే రాజు నేనే మంత్రి సినిమా జోగేంద్ర అనే ఒక సింపుల్ హ్యాప్పీ మ్యాన్ జీవితంలోని అతి ముఖ్యమైన ఆరు నెలల జీవితకాలం. ఒక సింపుల్ మ్యాన్ ఆరోగెంట్ గా ఎందుకు మారాడు.. అసలు అంత నార్మల్ గా బ్రతికేసే వాడికి పాలిటిక్స్ కి సంబంధం ఏంటి అనేదే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా…

నేనే అలా మారిపోతాను…

నన్నడిగితే ప్రతి సినిమాకి మేకోవర్ కంపల్సరీ… ఏ క్యారెక్టర్ నయితే యాక్ట్ చేస్తున్నామో, లుక్స్ దగ్గరి నుండి, బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతీది మారాల్సిందే.. లేకపోతే న్యాచురల్ గా ఉండదు… ప్రతి సినిమా ఎలా ఒకటి కాదో, ప్రతి క్యారెక్టర్ ఒకలా ఉండదు… క్యారెక్టర్స్ కి తగ్గట్టు మారాల్సిందే.

కాజల్ నే ఎందుకు ప్రిఫర్ చేశారు…?

ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంది. ఇలాంటి కథకి కాజల్ అయితేనే పర ఫెక్ట్ అని తేజ గారు బిగినింగ్ నుండి చెప్తూనే ఉన్నారు.  ఇది జోగేంద్ర కథే అయినా ఆ కథ మాత్రం రాధ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జోగేంద్ర జీవితంలోని ప్రతి అడుగు, తన వైపే తనకోసమే.. అంత పవర్ ఫుల్ క్యారెక్టర్. సో కాజల్ కి ఉన్న స్టార్ డమ్, తేజ గారికి కజాల్ కి ఉన్న అండర్ స్టాండింగ్, ఇన్సిడెంటల్ గా కాజల్ ఫస్ట్ మూవీ ఆయనతోనే, 50 వ సినిమా ఆయనతోనే.. అలా కాజల్ అయితే ప్రతి ఎలిమెంట్ ఎగ్జైటెడ్ గా అనిపించింది.

ఇంటరెస్టింగ్ గా ఉంటుంది..

క్రైమ్, పవర్, పాలిటిక్స్, మనీ ఇలాంటి వరల్డ్ లోకి ఒక సింపుల్ మ్యాన్ ఎంటరయితే ఎలా ఉంటుంది..? ఒక కసితో పట్టుదలతో అసలు పాలిటిక్స్ అంటే అవగాహన కూడా లేని మనిషి పాలిటిక్స్ లోకి ఎంటరయితే ఏం జరుగుతుందనేది ఈ సినిమాలో మోస్ట్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్. అవగాహన లేక అతను చేసే తప్పులు, సినిమాలో హైలెట్.

ఈ టైటిలే ఎందుకు..?

జోగేంద్ర ఆటిట్యూడ్ అదీ… టైటిల్ లో క్యారెక్టర్ ఆటిట్యూడ్ హైలెట్ అవ్వాలని ఫస్ట్ నుండే అనుకున్నాం… సో ఇదే పర్ ఫెక్ట్ అనిపించింది.

నేనలా అస్సలు అనుకోను…

ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకర్స్ కి నాన్ స్టాప్ సక్సెస్ రేషియో ఉండాలని లేదు. ఫ్లాప్స్ ఉన్న డైరెక్టర్స్ మళ్ళీ హిట్ కొట్టరు అని రూల్ లేదు.. నేను స్టోరీని నమ్ముతాను… స్టోరీ చెప్పే డైరెక్టర్ విజన్ ని నమ్ముతాను…

కాంపిటీషన్ ఉన్నా ప్రాబ్లం లేదు…

ఒక్కసారిగా ఇన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. ఆ సినిమాల్లో నా సినిమా కూడా ఉందనే హ్యాపీ ఫీలింగ్ తప్ప కాంపిటీషన్  అన్న ఫీలింగ్ లేదు. ఈ ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్, సంక్రాంతి వీకెండ్ అంత ఇంపాక్ట్ ఇస్తుందనిపిస్తుంది.