రానా ఫుల్ హ్యాపీ, రీజన్ అదే !

Sunday,June 11,2017 - 11:02 by Z_CLU

‘బాహుబలి’ లో భళ్లాలదేవ క్యారెక్టర్ తో ఇంటెర్నేష్నల్ స్టార్ గా గుర్తింపు అందుకున్న రానా లేటెస్ట్ గా ‘ఘాజీ’ అనే సినిమాతో సోలో గా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓన్ బ్యానర్ లో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేస్తున్న రానా ఈ సినిమా విషయం లో ఫుల్ హ్యాపీ గా ఉన్నాడట.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లీడర్’ సినిమాతో దగ్గుబాటి ఫామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన రానా ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా బయట బ్యానర్ లోనే చేశాడు.. కెరీర్ ఆరంభం నుంచి తన బ్యానర్ లో తండ్రి సురేష్ బాబు నిర్మాణంలో ఓ సినిమా చేయాలనీ ఉందంటూ చెప్పుకొచ్చిన రానా చాలా సందర్భాలలో తమ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఓ సినిమా చేయాలని ఉందని ఎప్పుడు చేస్తానో అంటూ తెలిపాడు. ఇక లేటెస్ట్ గా తమ ఓన్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తుండడం, ఆ సినిమా ఫస్ట్ టీజర్ కి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడట ఈ ఆరున్నరడుగుల హీరో. సో రానా కోరిక ఎట్టకేలకి తీరిందన్నమాట.