ఊహించని టైటిల్స్ తో....

Sunday,June 11,2017 - 10:05 by Z_CLU

ప్రెజెంట్ ఓ స్టార్ హీరో ఓ సినిమా స్టార్ట్ చేసాడంటే చాలు అప్పటి నుంచే కొంతమంది అభిమానులు తమ స్టార్ హీరో సినిమాకు ఆ టైటిల్ అయితే బాగుంటుందని, మరి కొంతమంది తమ హీరో సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ అంటూ కొన్ని టైటిల్స్ ను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. కట్ చేస్తే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న ఆ టైటిల్స్ నే తమ సినిమాలకు టైటిల్ గా ఫైనల్ చేసేసి ఫాన్స్ ను ఖుషి చేస్తున్నారు హీరోలు, దర్శకులు..


అయితే ఇలాంటి కొన్ని టైటిల్సే ఈ మధ్య రామ్ చరణ్ సినిమాతో పాటు బాలకృష్ణ సినిమాకు కూడా ప్రచారంలోకి వచ్చాయి. సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా మొదలైనప్పటి నుంచే ఈ సినిమాకు పలు టైటిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పల్లెటూరి ప్రేమ కథ గా తెరకెక్కే ఈ సినిమాకు ‘పల్లెటూరి మొనగాడు’, ‘రేపల్లె’,’మా ఊరి కుర్రోడు’ అనే పలు టైటిల్స్ వినిపించినప్పటికీ ఫైనల్ గా ఎవ్వరూ ఊహించని ‘రంగస్థలం’ అనే టైటిల్ తో మెస్మరైజ్ చేశాడు సుకుమార్.


ఇక బాలయ్య-పూరి జగన్నాథ్’ ల క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందనగానే ఈ సినిమాకి కూడా కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.. బాలకృష్ణ డాన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ‘ఉస్తాద్’, ‘జై బాలయ్య’ అనే టైటిల్స్ తో పాటు మరికొన్ని టైటిల్స్ కూడా సోషల్ మీడియా లో హల్చల్ చేశాయి. ఫైనల్ గా ఈ సినిమాకు పూరి మార్క్ తో ‘పైసా వసూల్’ అనే టైటిల్ ను పెట్టి ఫాన్స్ ఊహించని విధంగా సప్రయిజ్ చేశారు మేకర్స్. సో ఈ రెండు సినిమాలకు అభిమానులు ఊహించని టైటిల్ ను ఫిక్స్ చేసినప్పటికీ ప్రెజెంట్ ఈ రెండు టైటిల్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాలపై భారీ అంచనాలు పెంచేశాయి.