ఎట్రాక్ట్ చేస్తున్న కోలీవుడ్ బ్యూటీ

Sunday,June 11,2017 - 12:00 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో కోలీవుడ్, మల్లూవుడ్ భామలు అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనుపమ,నివేత థామస్,నందిత శ్వేతా, సాయి పల్లవి వంటి కోలీవుడ్, మల్లువుడ్ హీరోయిన్స్ తెలుగు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తూ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు . అయితే ఇప్పుడీ లిస్టులో మరో బ్యూటీ చేరింది.

ప్రెజెంట్ ఆ లిస్ట్ లో చేరిన హీరోయిన్ మరెవరో కాదు కోలీవుడ్ బ్యూటీ మేఘ ఆకాష్. తమిళ్ లో ఈ అమ్మడు నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే టాలీవుడ్ లో అఫర్ అందుకుంది. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘లై’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమా  ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ కోలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో? చూడాలి.