రానా కొత్త సినిమా డీటెయిల్స్

Wednesday,January 04,2017 - 02:00 by Z_CLU

మొన్నటి వరకూ బాహుబలి-2 షూటింగ్ లో బిజీ గా ఉన్న రానా ఆ సినిమా లో తన క్యారెక్టర్ కి సంబంధించిన షూట్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టేసాడు. ప్రెజెంట్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో జోగేంద్ర అనే పొలిటికల్ క్యారెక్టర్ లో నటిస్తున్న రానా ఈ సినిమాను వీలైనంత స్పీడ్ గా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

rana-daggubati

ప్రెజెంట్ అనంతపురం లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తో మళ్ళీ పూర్వ వైభవం అందుకోవాలని చూస్తున్నాడు  డైరెక్టర్ తేజ. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ను సమ్మర్ లో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్.