ఆ గ్యాప్ లో ఏం జరిగింది?

Wednesday,January 04,2017 - 03:00 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్  ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొన్ని నెలలు  గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే.  దాదాపు మూడు నెలల పైనే గ్యాప్ తీసుకొని ఫుల్ బిజీ గా గడిపిన తారక్ ఆ గ్యాప్ లో కొన్ని పవర్ ఫుల్ కాంబినేషన్స్ సెట్ చేసుకున్నాడు. ఒక పక్క తను నటించబోయే 27 సినిమాకు సంబంధించి కథలు వింటూనే మరో పక్క తన నెక్స్ట్ సినిమాల పై ఓ లుక్కేసాడు యంగ్ టైగర్.

 ntr-with-trivikram

ప్రెజెంట్ బాబీ డైరెక్షన్ లో తన 27 సినిమాను త్వరలోనే సెట్స్ పై తీసుకురాబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తన 28 సినిమా చేయబోతున్నాడు. ఈ గ్యాప్ లో కేవలం ఈ రెండు సినిమాల చర్చలతోనే ఆగకుండా మరో వైపు తన 29 వ సినిమాను అలాగే పనిలో పనిగా తన ప్రతిష్టాత్మక 30 వ సినిమాను కూడా ఫైనలైజ్ చేసేసుకున్నాడు యంగ్ టైగర్.

working-stills-12

 29 వ సినిమా కు ‘జనత గ్యారేజ్’ సినిమాతో గ్రాండ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ తో ప్లాన్ చేసుకున్నాడు తారక్. ఇటీవలే గ్యాప్ తీసుకున్న సమయం లో ఎన్టీఆర్ కి ఓ పాయింట్ కూడా చెప్పాడట కొరటాల.

ntr-jakkanna

ఇక ప్రతిష్టాత్మక 30 వ సినిమాను ‘స్టూడెంట్ నంబర్ 1’ తో హీరో గా గుర్తింపు అందించి కెరీర్ ఆరంభం లో ‘సింహాద్రి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు ‘యమ దొంగ’ తో పౌరాణిక పాత్రలో చూపించి మరో హిట్ అందించిన జక్కన్న తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. అంటే దాదాపు 2017 తో పాటు 2018 లో కూడా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్  ప్లాన్ చేసేసుకొని రిలాక్స్ గా తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టబోతున్నాడు ఈ నందమూరి హీరో.