ఆ డైరక్టర్ కు చోటేది...?

Wednesday,January 04,2017 - 01:00 by Z_CLU

టాలీవుడ్ లో మొన్నటివరకూ ఆ డైరెక్టర్ అంటే స్టార్ హీరోలకు భలే మోజు. ఆ డైరెక్టర్ కథ చెప్తే చాలు వెంటనే డేట్స్ ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆ డైరెక్టర్ తో ఓకే అంటూనే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా. ఆ దర్శకుడు మరెవరో కాదు టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్, ‘పోకిరి’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్.

ప్రెజెంట్ ఓ పక్క ఈ స్టార్ డైరెక్టర్ చెప్పే కథలు వింటూనే మరోపక్క ఇతర దర్శకులతో తో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్ ..

Puri Jagannadh, Chiranjeevi, Allu Arjun @ CineMAA Awards 2016 Function Stills

లేటెస్ట్ గా ఇలా పూరి చెప్పిన కథలు విన్న లిస్ట్ లో ముందున్నాడు మెగా స్టార్. ఆమధ్య పిలిచి మరీ తన 150 సినిమాకు కథ వినిపించమని పూరికి ఛాన్స్ ఇచ్చాడు చిరు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో చిరు 150 సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అనే టైం లో పూరి కథ నచ్చలేదని వినాయక్ కి ఛాన్స్ ఇచ్చాడు మెగా స్టార్.

Mahesh Babu, Puri Jagannath @ Business Man Movie Working Stills

ఇదే టైంలో మహేష్ బాబు తో ‘జనగణమన’ అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసాడు పూరి. కానీ మహేష్ బాబు ఎనౌన్స్ చేసిన 3 ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో పూరి జగన్ కు స్థానం దక్కలేదు.

 

ntr-with-puri-jagannath

ఇక పూరి కథ విన్న హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత తారక్ పూరితో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త మొన్నటివరకూ టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. ‘టెంపర్’ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చిన పూరి తోనే తారక్ మళ్ళీ సినిమా చేయబోతున్నాడని, ఈ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అనే టాక్ వినిపించింది. తీరా చూస్తే కొన్ని నెలల సస్పెన్స్ తర్వాత బాబీ తో తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసాడు తారక్. పోనీ ఈ సినిమా తరవాత అయినా పూరి తో సినిమా చేస్తాడనుకుంటే వెంటనే త్రివిక్రమ్ ను లైన్ లో పెట్టేసాడు ఎన్టీఆర్. ఇలా చాలామంది స్టార్లను మిస్ అయిపోయాడు పూరి జగన్నాధ్.