సైరా నుంచి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్

Saturday,March 09,2019 - 06:52 by Z_CLU

చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోంది సైరా సినిమా. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎలాంటి బడ్జెట్ లిమిట్స్ పెట్టుకోలేదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి మరో ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ వచ్చింది.

సైరా సినిమాకు సంబంధించి మెగాస్టార్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారట. మరీ ముఖ్యంగా ఈ ప్రొగ్రామ్ లో చిరంజీవిని, రామ్ చరణ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాడట. ఈ ఎక్స్ క్లూజివ్ వీడియోను త్వరలోనే షూట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారట.

ప్రస్తుతానికైతే ఇదింకా గాసిప్ లెవెల్ లోనే ఉంది. సైరా యూనిట్ నుంచి ఈ మేటర్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు. మెగాభిమానులు మాత్రం ఈ గాసిప్ నిజమైతే బాగుంటుందని కోరుకుంటున్నారు. చిరంజీవిని చరణ్ ఇంటర్వ్యూ చేయడం అంటే మాటలు కాదు. తలుచుకుంటేనే కిక్కిస్తోంది. మరి ఆ ముహూర్తం ఎప్పుడో?