చరణ్ సినిమాకు ప్రత్యేక అతిథిగా కేటీఆర్

Thursday,December 01,2016 - 07:30 by Z_CLU

రామ్ చరణ్ సినిమా ఫంక్షన్ అంటే కచ్చితంగా అది మెగాా ఫెస్టివలే. మెగా కాంపౌడ్ నుంచి చాలామంది హీరోలు, ప్రముఖులు ఆ ఈవెంట్ కు ఎటెండ్ అవుతారు. మరీ ముఖ్యంగా చెర్రీ సినిమా అంటే చిరంజీవి మిస్ కారు. ఎలాగోలా ఫంక్షన్ కు వస్తారు. తనయుడి చిత్రానికి అదనపు ప్రచారం కల్పిస్తారు. అయితే ఈసారి చెర్రీ సినిమాకు ఓ ప్రత్యేక అతిథి హాజరుకానున్నారని టాక్. ఆ గెస్ట్ పేరు కేటీఆర్. అవును.. తెలంగాణ మంత్రి కేటీఆర్… చరణ్ సినిమా ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారట.

ramcharan-ktr

ఈనెల 4న హైదరాాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్ లో ధృవ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని మెగా కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది. కాంపౌండ్ నుంచి త్వరలోనే దీనిపై ఓ స్టేట్ మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో.. ధృవ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కాంగ్రెస్ నేత చిరంజీవి-టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఒకే వేదికపై కనిపించే అవకాశముంది.