ధృవ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌... ప్లేస్ ఫిక్స్..

Tuesday,November 29,2016 - 03:53 by Z_CLU

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధృవ‌`. మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌రణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌గ‌ధీర వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో సినిమాపై ఇంట్రెస్ట్ డబుల్ అయింది.

హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాను ప్ర‌పంచవ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న విడుద‌ల చేస్తున్నారు. అంతకంటే ముందుగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, ప్రేక్ష‌కులు, మెగాభిమానుల స‌మ‌క్షంలో డిసెంబ‌ర్ 4న హైదరాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ లైన్స్‌లో ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు.