అదుగో.. అర్జున్ వచ్చేస్తున్నాడు

Saturday,March 09,2019 - 02:47 by Z_CLU

అర్జున్ ముస్తాబయ్యాడు.
సెంచరీ కొడుతూ సంబరాలు చేసుకుందామని పిలుస్తున్నాడు.
అర్జున్ పాత్రలో నాని నటిస్తున్న జెర్సీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 19న వరల్డ్ వైడ్ ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై మొన్నటివరకు కొనసాగిన డైలమా వీడింది.

నిజానికి జెర్సీ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేస్తామంటూ మేకర్స్ అన్-అఫీషియల్ గా పదేపదే చెబుతూనే ఉన్నారు. కానీ ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయంటూ గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అలాంటి పుకార్లకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఇలా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ మూవీలో నాని సరసన శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా. అనిరుధ్ ఈ సినిమాకు అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేశాడు. సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ బ్యానర్ పై థియేటర్లలోకి రాబోతోంది జెర్సీ.