రామ్ చరణ్ రెడీ.. ఎన్టీఆర్ కు రెస్ట్

Thursday,October 10,2019 - 05:13 by Z_CLU

గ్యాప్ లేకుండా సాగుతోంది ఆర్-ఆర్-ఆర్ షూటింగ్. మొన్నటివరకు బల్గేరియాలో భారీ షెడ్యూల్ నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ గండిపేట్ లో అర్థరాత్రి 2 వరకు షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో చరణ్-తారక్ ఇద్దరూ పాల్గొంటున్నారు. అదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్.

మొన్నటివరకు ఆర్-ఆర్-ఆర్ కు దూరంగా గడిపాడు చరణ్. తండ్రి మెగాస్టార్ ను హీరోగా పెట్టి భారీ బడ్జెట్ తో సైరా సినిమా నిర్మించిన చెర్రీ, ఆ మూవీ ప్రమోషన్-రిలీజ్ పనుల్లో బిజీగా గడిపాడు. అలా RRRకు దూరమయ్యాడు. ఆ టైమ్ లో తారక్ తో షూట్ కానిచ్చారు. ఇప్పుడు చరణ్ సెట్స్ పైకి రావడంతో, ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోబోతున్నాడు.

అవును.. గండిపేట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు విరామం తీసుకోబోతున్నాడు. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ తో షూట్ ను కొనసాగిస్తాడు రాజమౌళి. అలా గ్యాప్స్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలిద్దరూ.

RRR సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. రామ రౌద్ర రుషితం అంటూ మొన్నటివరకు చక్కర్లుకొట్టిన టైటిల్ కూడా నిజమైంది కాదని తేలిపోయింది. ఇప్పట్లో టైటిల్ ప్రకటించే ఉద్దేశం లేదని యూనిట్ సభ్యులు అంటున్నారు.