RRR: రాజమౌళి స్టోరీ చెప్పేశాడు

Thursday,March 14,2019 - 12:55 by Z_CLU

RRR.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్
ఇద్దరు పెద్ద హీరోలు నటించడానికి ఒప్పుకున్నారంటే ఈ సినిమా కథ కచ్చితంగా స్పెషల్ అయి ఉంటుంది. ఆ స్టోరీలైన్ పై మొన్నటివరకు చాలా డిస్కషన్ కూడా నడిచింది. బాక్సర్ గా నటిస్తున్నాడని కొందరంటే, పోలీసాఫీసర్ అని మరికొందరన్నారు. ఎట్టకేలకు ఈ సినిమా స్టోరీలైన్ పై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.

1897లో ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. యుక్తవయసులో ఇల్లు వదలి వెళ్లారు.. రెండేళ్లు ఏం జరిగిందో తెలీదు. తిరిగి వచ్చారు స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది మాత్రం మనకు తెలుసు. అదే టైమ్ లో 1901లో కొమరం భీమ్ పుట్టారు.. ఈయన కూడా ఇల్లు వదిలి వెళ్లారు.. కట్ చేస్తే అక్కడ కూడా ఏం జరిగిందో తెలీదు.. మళ్లీ తిరిగొచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. ఇద్దరూ వీరమరణం పొందారు. చరిత్రలో కలవని ఈ ఇద్దరు వీరులు, ఒకవేళ కలిస్తే, ఒకరికి ఒకరు స్ఫూర్తిగా నిలిస్తే, బెస్ట్ ఫ్రెండ్స్ గా మారితే ఎలా ఉంటుందనేది
నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మా కథకు అదే మూలం.”

ఇలా RRR స్టోరీలైన్ ను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు రాజమౌళి. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలిద్దరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని.. ఎవరూ ఎక్కువ-తక్కువ కాదని క్లారిటీ ఇచ్చాడు. రెండు పాత్రలు ప్రేక్షకుల హృదయానికి హత్తుకుంటాయంటున్నాడు.

ఈ కాలంలో మా సినిమా ప్రయాణించదు. అంతా అనుకుంటున్నట్టు పునర్జన్మలు ఉండవు. సినిమా మొత్తం 1920 బ్యాక్ డ్రాప్ లో బ్రిటిష్ రూలింగ్ టైమ్ లోనే నడుస్తుంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలన్నీ చరిత్ర నుంచే తీసుకున్నాం. కానీ వాళ్ల చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రం ఫిక్షన్.

ఇక ఫస్ట్ లుక్స్ విషయానికొస్తే, చరణ్-తారక్ పుట్టినరోజులకు ఫస్ట్ లుక్స్ ఉండవని స్పష్టంచేశాడు రాజమౌళి. సినిమా రిలీజ్ కు ఇంకా ఏడాదికి పైగా టైమ్ ఉంది కాబట్టి, ఇప్పట్లో లుక్స్ వదలమని క్లారిటీ ఇచ్చేశాడు.