ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Thursday,October 10,2019 - 06:30 by Z_CLU

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సూపర్ హిట్ ఫిల్మ్ ఇస్మార్ట్ శంకర్ ను ప్రేక్షకులకు అందిస్తోంది జీ తెలుగు.

“మార్ ముంత చోడ్ చింత”.. ఒక్క డైలాగ్ తో బాక్సాఫీస్ రికార్డుల్ని మరోసారి తిరగరాశాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇడియట్, పోకిరి లాంటి సూపర్ హిట్లతో ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకున్న పూరీ జగన్నాథ్… స్టార్ హీరోని సూపర్ స్టార్ గా మార్చగలనని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

అద్భుతమైన కథ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, ఫైనల్లో సూపర్బ్ ట్విస్ట్.. ఇది పూరీ జగన్నాథ్ స్టైల్. హీరో రామ్ తో సూపర్ హిట్ కొట్టేందుకు ఈసారి కూడా అలాంటి కథనే ఎంచుకున్నాడు పూరీ. రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్లో రామ్ ను ప్రజెంట్ చేశాడు.

పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాతలుగా వ్యవహరించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన నటా నభాష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయబోతోంది జీ తెలుగు. ఈ సినిమాను అక్టోబర్ 13, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగు, జీ తెలుగు హెడ్ డీ ఛానెల్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.

సో.. డోంట్ మిస్ ద ఇస్మార్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్..
ఎక్స్ క్లూజివ్ గా మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డీ చానెల్స్ లో….