నాగచైతన్య సినిమా వాయిదా?

Thursday,October 10,2019 - 04:56 by Z_CLU

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. లెక్కప్రకారం ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవ్వాలి. మేకర్స్ ఇదే విషయాన్ని ఎనౌన్స్ చేశారు కూడా. కానీ చెప్పిన టైమ్ కు ఈ సినిమా రాదనేది లేటెస్ట్ రూమర్.

ఈ సినిమా మేకింగ్ కు ఇంకాస్త ఎక్కువ టైమ్ తీసుకోవాలని భావిస్తున్నాడట దర్శకుడు శేఖర్ కమ్ముల. పెర్ఫెక్షన్ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసే ఈ డైరక్టర్.. నాగచైతన్య-సాయిపల్లవి సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. పైగా ఇది డాన్స్, మ్యూజిక్ బేస్డ్ సినిమా కావడంతో అనుకున్న రేంజ్ లో ఔట్ పుట్ రావడం కోసం టైమ్ తీసుకోవాలని అనుకుంటున్నాడట.

నిజానికి ఈ సినిమా వాయిదా పడుతుందని చాలామంది అనుమానించారు. ఎందుకంటే, ఏడాదిలోపు సినిమా చేయడం శేఖర్ కమ్ములకు అలవాటు లేదు. అలాంటిది జస్ట్ 4 నెలల్లో నాగచైతన్య-సాయిపల్లవి సినిమాను రిలీజ్ చేస్తానని కమ్ముల ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. కానీ అందరి అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్టు టాక్. ఎప్పట్లానే ఈ గాసిప్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే తనపని తాను చేసుకుపోతున్నాడు కమ్ముల.